జయంతిపురం గ్రామంలో తక్షణమే రోడ్ మరమ్మతులు చేయాలి.. జనసేన పార్టీ ఈమని కిషోర్ కుమార్

జయంతిపురం గ్రామంలో తక్షణమే రోడ్ మరమ్మతులు చేయాలి.. జనసేన పార్టీ ఈమని కిషోర్ కుమార్

               జగ్గయ్యపేట మండలంలో, జయంతిపురం గ్రామంలో స్థానిక మద్రాస్ సిమెంట్స్ వ్యాగన్ సమీపంలో గల గుంటలుగా మారి, ఇబ్బందికరంగా ఉన్నటువంటి రోడ్ మార్గాన్ని ఈరోజు జనసేన పార్టీ తరుపున నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్ మార్గాన్ని సందర్శించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ మాట్లాడుతూ జయంతిపురం గ్రామంలో మద్రాస్ సిమెంట్స్ వ్యాగన్ సమీపంలో ఎప్పటినుంచో రోడ్ బాగా గుంటలుగా మారి ఇబ్బందికరంగా ఉన్నపటికీ ప్రభుత్వం వారు స్పందించడం లేదు అని, ఈ రోడ్ మార్గం వలన ఇటు గ్రామ ప్రజలతో పాటుగా అతి సమీపంలో ఉన్న వేదాద్రి నరసింహ స్వామి వారి దర్శనార్థం భక్తులు కూడా ఈ మార్గం గుండానే వెళ్లాల్సిన అవసరం ఉన్నందున అటు భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, వర్షా కాలం అవటంతో చిన్న పాటి వర్షాల వలన కూడా మరీ ఇబ్బంది కరంగా ఉంటుందని ఆయన తెలిపారు. మరీ తక్షణమే ప్రభుత్వం వారు స్పందించి ఈ గ్రామస్థుల భాదని అర్థం చేసుకుని రోడ్ మరమ్మతులు చేయించాల్సిందిగా గ్రామస్థుల తరుపున జనసేన పార్టీ ప్రభుత్వాన్ని కోరుచున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాం, నాగ, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

See also  మీడియా మీద దాడి హేయమైన చర్య : జనసేన నాయకులు ఏపీ శివయ్య