
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం AI-ఆధారిత ECD స్క్రీనింగ్‌పై జిల్లా స్థాయి శిక్షణపై అవగాహన కల్పిస్తున్న ఆర్జేడి బత్తుల మనోరంజని
నరసరావుపేట,జూన్ 03 ( జనస్వరం)
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం AI-ఆధారిత ECD స్క్రీనింగ్‌పై జిల్లా స్థాయి శిక్షణపై అవగాహన కార్యక్రమం జూన్ 2, 3వ తేదీల్లో జిల్లా స్థాయిలో ఉన్న సిడిపివోలు, సూపర్వైజర్స్ మరియు మెడికల్ ఆఫీసర్లు అందరికీ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గుర్రం జాషువా హాల్ కలెక్టర్ ఆఫీస్ నరసరావుపేట నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్జేడి బత్తుల మనోరంజని ప్రాంతీయ సంచాలకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదడు యొక్క అభివృద్ధిపై మరియు హైపర్ యాక్టివిటీ, ఐసిడిఎస్ లక్ష్యాలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లల స్క్రీనింగ్ వాటిపై ఆమె అవగాహన కల్పించారు.
పిడి ఉమాదేవి మాట్లాడుతూ హెల్త్ యొక్క ప్రాముఖ్యత, హెల్త్ అండ్ ఐసిడిఎస్ రెండు డిపార్ట్మెంట్లు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. కృత్రిమ మేధావిక ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే వైద్య పరీక్షలతో బాలబాలికల ఆరోగ్య స్థితిని గుర్తించి సత్వరంగా మెరుగైన వైద్య సేవలు అందించినప్పుడే వారి వికాసం సాధ్యమవుతుందని అన్నారు .అనంతరం మాచర్ల సిడిపిఓ కృష్ణవేణి నవ చైతన్య పై అవగాహన కల్పించారు. డి బి .మాణిక్యరావు ఐసిడిఎస్ లక్ష్యాలు, 0 – 2 ఏళ్ల పిల్లల పోషణ, ఆరోగ్యం ,మానసిక మరియు శరీరక, సామాజిక అభివృద్ధి పై అవగాహన కల్పించారు.


ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ఇంచార్జి పద్మావతి, డి ఐ ఓ రోహిణి రత్నశ్రీ, డిస్టిక్ కోఆర్డినేటర్ ఐసిసి పల్నాడు జిల్లా బి. మాణిక్యరావు, నోడల్ ఆఫీసర్ అరుణ (రేపల్లె) పల్నాడు జిల్లాలోని సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు.








