
కొడవలూరు అరుంధతీయుల మీద రెవిన్యూ అధికారుల దౌర్జన్యం : జనసేన పోరాటం
నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం, కొడవలూరు లో ఎన్నో నెలలనుంచి రెవిన్యూ అధికారులకు కొడవలూరు అరుంధతీవాడ కుటుంబాలకు మద్య జరుగుతున్న న్యాయపోరాటంలో ఈరోజు మళ్ళీ గ్రామస్తుల మీద రెవిన్యూ అధికారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అర్హులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా అధికారపార్టీ నాయకులకు , అధికారపార్టీ కార్యకర్తలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం పై కొడవలూరు ప్రాంత అరుంధతీవాడ ప్రజలు ఆందోళనకు దిగారు. గతంలో ప్రభుత్వాలు అరుంధతీవాడకి ఇచ్చిన స్థలాన్ని ఇప్పటి అధికారపార్టీ స్థానిక నాయకుల అండదండలతో ఆ ఇళ్ళ స్థలాన్ని అన్యాయంగా లాక్కొంటున్నారని ఎన్నో నెలల నుంచి స్థలాల్లో న్యాయపోరాటానికి
కూర్చున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదని ఆ నిరుపేద కుటుంబాలు బోరున విలపించాయి. సమస్యగురించి తెలుసుకున్న నెల్లూరుజిల్లా జనసేనపార్టీ యువజనవిభాగ అద్యక్షుడు శ్రీ గునుకుల కిషోర్ గారు మరియు వారి బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కొడవలూరు మండలం సబ్ ఇన్స్పెక్టర్ గారితో మరియు రెవిన్యూ అధికారులతో మాట్లాడుతూ పేదవారికి ఎవ్వరికైనా అన్యాయం జరిగితే సహించేదిలేదని పేదవారికి న్యాయం జరగడంకోసం ఎంతవరకైనా పోరాడతామని తెలియచేశారు. రాబోయే రోజులలో జనసేన పార్టీ మరియు బీజేపీ సంయుక్తంగా ఈ సమస్య పై పోరాడుతాం అని తెలిపారు.









