ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని జనసైనికుల వినతి

ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని జనసైనికుల వినతి.

ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ కు వినతిపత్రం అందజేశారు. విద్యాబుద్ధులు నేర్పే గురువు ను దైవంతో సమానంగా చూసే సంస్కృతి మనది. కరోనా వల్ల ప్రైవేటు యాజమాన్యం లోని పాఠశాలలు, కళాశాలలో పనిచేస్తున్న బోధన సిబ్బంది పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది గత నాలుగు నెలలుగా జీతాలు అందక పోవడం వల్ల కొందరు ఉపాధ్యాయులు రోడ్లపై బండ్లమీద పండ్లు కూరగాయలు అమ్ముకుంటున్న విషయం తెలిసిందే ఈ సమయంలో ఆర్థిక పరమైన ఒడిదుడుకులు వస్తున్నాయి చిన్నపాటి ప్రైవేట్ పాఠశాలలు ఇలాంటి ఇక్కట్లు వనరులు సమకూర్చుకోవడానికి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిసింది అయితే ఎన్నో ఏళ్లుగా నిలదొక్కుకొని ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలు కూడా సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడం ఆశ్చర్యంగా ఉంది అని ఎందరో భవిష్యత్తుని తీర్చిదిద్ది స్థాయిలో ఉన్న ఉపాధ్యాయులు అధ్యాపకులు ప్రైవేటు రంగంలో పనిచేయడం వల్ల ఏడాదిలో 10 నెలల జీతం మాత్రమే వస్తుందని ఇప్పుడు అది కూడా లేకుండాపోయింది విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేసిన జీతాలు మాత్రం కరోనా పేరుతో గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం తో కుటుంబం గడవడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేసి విద్యార్థుల నుంచి రుసుములు తీసుకుంటున్న విద్యా సంస్థలు తమ సిబ్బందిని తగ్గించి చేస్తున్నారు కావున లక్షల్లో ఉన్న ఉపాధ్యాయులు అధ్యాపకులు కష్టాలను రాష్ట్ర విద్యాశాఖ పరిగణలోకి తీసుకొని ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగాలు చేస్తున్న వారిని ప్రభుత్వం గుర్తించి తక్షణ ఉపశమనం కోసం 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించేలా చూడాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

See also  కదిరి జనసేనపార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు