జనసేన జెండా ఆవిష్కరణకు స్థలం అనుమతి వినతి

బ్రహ్మసముద్రం, డిసెంబర్ 17, (జనస్వరం) : బ్రహ్మసముద్రం మండల పరిధిలోని కోనాపురం గ్రామంలో నిర్వహించనున్న జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి స్థలం కేటాయింపు కోసం మండల జనసేన నాయకులు తహసిల్దార్ సుమతిని మర్యాదపూర్వకంగా కలిశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన బ్రహ్మసముద్రం మండల జనసేన నాయకులు వి.హెచ్.రాయుడు, కోనాపురం కరేగౌడు, మణికంఠ, దండు కురుబ తిప్పేస్వామి తదితరులు ఈరోజు తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. త్వరలో కోనాపురం గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించబోయే జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి జెండా కట్ట నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని వారు కోరారు. ఈ సందర్భంగా స్పందించిన తహసిల్దార్ సుమతి, జనసేన నాయకుల అభ్యర్థనను సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు. అవసరమైన అనుమతులు మంజూరు చేస్తామని, తామే స్వయంగా గ్రామానికి వచ్చి జెండా కట్ట నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు అధికారుల నుంచి వచ్చిన సానుకూల స్పందనతో మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రజల మద్దతుతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.

See also  జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించిన అనంతపురం జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :