రాయపాలెం కాలువ పూడిక తీసి పైకప్పు వేయండి : జనసేన నాయకులు గునుకుల కిషోర్

      నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ పదో డివిజన్ నందు రాయపేట కాలువ పూడిక తీసి దాదాపుగా నాలుగు సంవత్సరాలు అవుతుంది అని స్థానికులు వాపోవడంతో జనసేన తరపున జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ మున్సిపల్ కమిషనర్ కి అభ్యర్థన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలలో కేవలం రెండుసార్లు మాత్రమే రామ్ నగర్, రాయపేట కాలువ డ్రైనేజీ పూడిక తీశారు. వ్యర్ధాలు బయటపడి దోమలు విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని, కాలువ నిండిపోయి వ్యర్ధాలు డ్రైనేజీ నుంచి ఇంట్లోకి వస్తున్నాయని వెంటనే కాలువ పూడిక తీయాలని కోరారు. కమిషనర్ స్పందించి సంబంధిత ఇంజనీరింగ్ కి ఈ సమస్యను తీర్చవలసిందిగా తెలిపారు.

See also  గాంధీజి కలలు కన్న ఆశయాలు ఆశలు జనసేనతోనే సాకారం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :