నిరుపేద కార్యకర్తల కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత

    అనంతపురం, (జనస్వరం) : జనసేన పార్టీ “రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు” శ్రీమతి పెండ్యాల శ్రీలత గారి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని జనసేన పార్టీ నిరుపేద కార్యకర్తల కుటుంబాలకు 25కేజిల బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవలే ప్రమాదవశాత్తు మృతి చెందిన అనంతపురం నగరంలోని బీజేపీ కాలనికి చెందిన జనసేన కార్యకర్త గుండె సంజీవరాయుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి 25కేజీల బియ్యం నిత్యావసర సరుకులు పెండ్యాల శ్రీలత అందించి గుండె సంజీవరాయుడు పిల్లల విద్యాభివృద్ధికి పెండ్యాల హరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, సంయుక్త కార్యదర్శి దేవరకొండ జయమ్మ, నాయకులు పెండ్యాల చక్రధర్, రోడ్ల భాస్కర్, తోట ప్రకాష్, టీ.ఎన్.అంజి, M.V శ్రీనివాస్, ఆకుల ప్రసాద్, ముని, సుమన్, వంశీ, చిరు తదితరులు పాల్గొనడం జరిగింది.

See also  రాజధాని రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్న జనసేన పీఏసీ చైర్మన్‌ శ్రీ నాదెండ్ల మనోహర్‌ గారు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి