కడప నియోజకవర్గంలో క్రియా శీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కార్యదర్శి శ్రీ సుంకర శ్రీనివాస్

రాయలసీమ

        కడప,  (జనస్వరం) : కడప నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక కార్యకర్తలకు రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కార్యదర్శి శ్రీ సుంకర శ్రీనివాస్ చేతుల మీదుగా ఇన్సూరెన్స్ కిట్లు పంపిణీ చేశారు.  ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు  నియోజకవర్గములో పూర్తి చేయటం శుభప్రదం అని ఆయన  తెలిపారు. తన వ్యక్తిగత సంపాదన నుంచి కార్యకర్తల శ్రేయస్సు నిమిత్తం కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిదే అనీ, ఈ సభ్యత్వంతో పాటు సభ్యులకు ఇచ్చిన భీమాసౌకర్యంతో ప్రమాదం జరినపుడు, వైద్యం నిమిత్తం రూ50000లు ప్రాణహాని జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు రూ 500000 ఇస్తూ పార్టీ తరపున భరోసా కల్పిస్తున్నామని, దేశంలో మరే రాజకీయ పార్టీల్లో లేని సౌకర్యం జనసేన పార్టీ కలగజేసింది. రానున్న రోజుల్లో అన్నీ నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యత్వాలు పూర్తి చేసి బలమైన కమిటీలు ఏర్పరుచుకొని, కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజల ఆర్థిక కష్టాలను సైతంలెక్క చేయక పన్నులతో బాదుతూ పీడిస్తున్న ప్రభుత్వంతో పోరాటానికి సామాన్యుడికి అండగా నిలుస్తామనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా జనసైనికులు మరియు ముఖ్య నాయకులు తదితురులు పాల్గొన్నారు.

See also  కూలీలుగా మారిన ప్రభుత్వ ఉద్యోగులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి