కొడిమి గ్రామానికి వంతెన నిర్మించాలని రాప్తాడు జనసేన నాయకుల డిమాండ్

    రాప్తాడు, (జనస్వరం) : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కొడిమి గ్రామం గత కొన్ని సంవత్సరాలుగా కొడిమి గ్రామానికి వర్షం వచ్చినప్పుడు పోవాలంటే కోడిమీ వంకను దాటి పోలేని పరిస్థితి ఏర్పడిందని రాప్తాడు ఇంఛార్జ్ సాకే పవన్ కుమార్ పేర్కొన్నారు. దీనితో ఈ గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఎలక్షన్స్ ముందర ప్రతి ఒక్క పార్టీ అధికారంలోకి రావడానికి ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. గెలిచిన తర్వాత కనీసం ఇటువైపు తిరిగి చూడని పాపం ఏ ఒక్క అధికార పార్టీకి పోలేదని వాపోయారు. వెంటనే ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపకపోతే రాబోవు రోజుల్లో అక్కడి స్థానిక ప్రజలతో కలిసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వమును  హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఇంఛార్జ్ పవన్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, వెంకటేష్ పాల్గొనడం జరిగింది.

See also  పేదల ఇళ్ళకు అండగా నిలబడింది మేమే : పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి