జనసేన ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందజేత

జనసేన

    గుంటూరు ( జనస్వరం ) : పొన్నూరు నియోజకవర్గం, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా ఆధ్వర్యంలో 300 మంది ముస్లిం పేద ప్రజలకు రంజాన్ తోఫా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గారు పాల్గొని ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేశారు. అనంతరం గాదె వేంకటేశ్వర రావు మాట్లాడుతూ ఎవరికైనా సహాయం చేయాలంటే మనసుండాలి. ఈ యొక్క పండగ సందర్భంలో తనకు ఉన్న దానిలో నుంచి ఇతరులకు కొంత సహాయం చేయాలని ఆలోచన చేసిన పట్టణ అధ్యక్షుడు కరీముల్లా గారికి దేవుడు మరింత శక్తిని ఇచ్చి రానున్న రోజుల్లో ఎక్కువ మందికి సహాయం చేసే శక్తిని ఆ అల్లా ప్రసాదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నాయకులు, పొన్నూరు నియోజకవర్గ నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు.

See also  శ్రీశైలం జనసేనపార్టీ కార్యాలయం నందు టీం పిడికిలి పోస్టర్లు ఆవిష్కరించిన జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :