జనసైనికుడి మృతికి న్యాయం జరగాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన రామ్మోహన్

    ఆముదాలవలస ( జనస్వరం ) : విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంతో జనసేన నాయకుడు గొర్లె వసంత కుమార్ చనిపోయిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదానికి కారకులైన విద్యుత్ అధికారులు పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  పేడాడ రామ్మోహన్ రావు గారు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి పరిహారంగా 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ఈ సంఘటన పైన ఎంక్వయిరీ వేయడం జరిగింది. ఈ సంఘటనకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని రామ్మోహన్ గారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యలకల రమణ, పైడి మురళీమోహన్, కొత్తకోట నాగేంద్ర మరియు నియోజకవర్గ నాయకులు కొంచాడ సూర్య, మురిపాక రాజశేఖర్, ఎచ్చర్ల కిషోర్ కుమార్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

See also  జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లలను ఆవిష్కరించిన విజయవాడ జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి