పంచకర్ల రమేష్ బాబుకి ఘన స్వాగతం పలికిన జనసైనికులు

పంచకర్ల

       పెందుర్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జనసేన పార్టీలో జాయిన్ అయినా విశాఖపట్నం సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారుకి 88 వార్డ్ జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్థన శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుభాభినందనలు తెలిపారు. మీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జనసేన పార్టీ మరింత అభివృద్ధి చెందాలని విజయవాడ అమ్మవారి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని అమ్మవారి సాలువాతో సత్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు నాయకులు గోపి, ప్రసాద్, గంగవరం రాజు, శ్రీను, నరేష్, దుబాయ్ రాజు, కార్తిక్, సూర్య, గావర శ్రీను, సిద్దు మరియు నాయకులు పాల్గొన్నారు.

See also  ప్రకాశం జిల్లా : పెరిగిన విద్యుత్ చార్జీలపై జనసేన పోరాటం