జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన రాజోలు జనసేన నాయకులు

రాజోలు

    రాజోలు,  (జనస్వరం)  :  రాజోలు నియోజకవర్గం మోరి పొడు లో జనసైనికుడు రుద్ర రమేష్ గారి ఇల్లు అగ్ని ప్రమాదములో పూర్తిగా కాలిపోవడంతో,  వారి ఇల్లు నిర్మాణం నిమిత్తం జనసేన నాయకులు, కార్యకర్తలు , జనసైనికులు కలిసి  2 లక్షల రూపాయలు మరియు  రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు గెడ్డం మహలక్ష్మి ప్రసాద్ గారు 25,000 రూపాయలు అందించడం జరిగింది.వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చిన , ఆపదలో ఉన్న ఎల్లప్పుడు జనసేన పార్టీ మరియు జనసేన నాయకులు , అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.

See also  చేనేతల అభివృద్దే జనసేన పార్టీ లక్ష్యం: రాష్ట్ర చేనేత వికాస అధ్యక్షులు చల్లపల్లి శ్రీనివాస్ రావు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి