కోవిడ్ పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాజంపేట జనసేన నాయకులు

               తిరుపతి రుయా హాస్పిటల్ లో 11 మంది ఆక్సిజన్ కొరత వల్ల మరణించడం జనసేన పార్టీ నాయకులను దిగ్భ్రాంతికి గురి చేసింది అని చనిపోయిన వారికి సంతాపం తెలియజేయటం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు బాల సాయి కృష మాట్లాడుతూ గత నెల 11వ తేదీ తిరుపతిలో కరోనా వచ్చి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరడానికి ప్రయత్నించినా డబ్బు ఇచ్చి వైద్యం తీసుకుందాం అన్న ఎక్కడా బెడ్ ఆక్సిజన్ దొరక ఇంటిదగ్గర చాలా ఇబ్బందులు పడ్డామని ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొని ఉంది అని దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని ఆవేదన వ్యక్తం చేశారు. రుయా హాస్పిటల్ లో మరణించిన వారికి 10 లక్షలు ప్రకటించిన మన ముఖ్యమంత్రి బతికుండి ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు అని ఇప్పటికీ ప్రజలు ఆక్సిజన్ కొరత వల్ల, ఇబ్బందులు పడుతున్నారు. మందులు మరియు ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ లో వ్యాపారం జరుగుతోంది అని ఆక్సిజన్ కొరత పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందేలా చూడాలి అని చెప్పారు. బతికున్నోడికి ఆక్సిజన్ లేదు, చనిపోయిన వారికి స్మశానంలో దహనం కూడా లేదు అయినా అధికారులలో చలనం లేదని ప్రజలు అనుకుంటున్నారు అని తెలిపారు.

రాయలసీమకు ఆరోగ్యం విషయం లో ప్రతి ఒక్కరూ వెళ్ళే తిరుపతి లోనే కాకుండా రాష్ట్రమంతా ఇదే పరిస్తితి . ప్రభుత్వం మరియు నాయకులు ఈ విపత్కర పరిస్థితులలో బాధ్యత గా వ్యవహరించాలని రాష్ట్రం లో మెడికల్ ఎమర్జెన్సీ నడుస్తోంది అని దానికి తగిన రీతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే కాకుండా ప్రజలు కూడా ప్రభుత్వాలను మాత్రమే నిందించటం మాని సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లను సరిగా ధరించాలని అనేక చోట్ల ఇంకా ప్రజలు కనీసం మాస్క్ లు సరిగా ధరించటం లేదని చెప్పారు. ప్రజల నిర్లక్షమే ఈ పరిస్థితికి కారణం అని అందరూ బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. కరోనా వచ్చిన వారు ధైర్యంగా ఇమ్మునిటీ తో ఎదుర్కోవాలని ధైర్యాన్ని కోల్పోవద్దు అని తెలిపారు. ఈ సందర్భంగా రాజంపేట మండల జనసేన ఇంఛార్జి కత్తి సుబ్బరాయుడు గారు మాట్లాడుతూ కోవిడ్ ఆసుపత్రి నీ రాజంపేట లో సత్వరమే ఏర్పాటు చెయ్యాలని ఎలక్షన్ లలో ఇంటి ఇంటికి తిరిగి వేల కోట్లు ఖర్చు పెట్టే నాయకులు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యత గా వ్యవహరించాలి అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బాల సాయి కృష్ణ, కత్తి సుబ్బరాయుడు, కే. వెంకటయ్య, బండ్ల రాజేష్ పోలిశెట్టి శ్రీను తదతరులు పాల్గొన్నారు. 

See also  భగవాన్దాస్ పేటలో జనంకోసం జనసేన కార్యక్రమం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి