మాండవ్య నది పై వంతెన నిర్మించాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చిన రాజంపేట జనసేన నాయకులు

    రాజంపేట, (జనస్వరం) : కడప కలెక్టరేట్ ఎదురుగా సోమవారం 10 గంటల నుండి రాజంపేట జనసేన సైనికులు దీక్ష చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండలం గడికోట పంచాయతీ 12గ్రామాలకు వరదలు వస్తే రహదారి లేక ఇబ్బందులకు గురవుతున్న సందర్భంగా మాండవ్య నది పై వంతెన నిర్మించి ఆ గ్రామల ప్రజలకు న్యాయం చేయాలని ఈరోజు దీక్ష చేసి ప్రభుత్వంపై లోపాలను ఎత్తి చూపి కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ మండల నాయకులు రామ శ్రీనివాసులు, పవన్ కుమార్, కొట్టే వెంకట రాజేష్, హరి రాయల్, కొత్తూరు వీరయ్య ఆచారి మరియు జనసైనికులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.

See also  వైసీపీకి రాజీనామా చేసి జనసేనపార్టీలో చేరిన బొగ్గు శ్యామ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి