ప్రభుత్వ భూమి ఆక్రమణపై తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేసిన రాజంపేట జనసేన నాయకులు

ప్రభుత్వ

     సుండుపల్లె, (జనస్వరం) :  మండల పరిధిలోని తిమ్మసముద్రం పంచాయితీ కోడూరు వాళ్ళ పల్లి సమీపంలో ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆక్రమించుకున్నారని గ్రామస్థులు మరియు జనసేన నాయకులు అందరూ కలిసి  తహసీల్దార్‌ భాస్కర్‌ కు ఫిర్యాదు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పశువుల మందగా ఉన్న ఆ భూమిని నరసింహులు అనే వ్యక్తి ఆక్రమించి చదును చేశారని, దీంతో పొలాలకు వెళ్లడానికి గ్రామస్తులందరూ దారిలేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. నరసింహులు ఆక్రమించిన పశువుల మంద స్థలాన్ని పరిశీలించి, ఆక్రమణలను తొలగించి గ్రామస్తులు దారి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు  రామ శ్రీనివాసులు, బీసీ నాయకులు  కుళ్లాయప్ప, గ్రామస్థులు, అంజి తదితరులు పాల్గొన్నారు. 

See also  రైల్వేకోడూరు లో జనసైనికుల ఆత్మీయ సమావేశం