జనసేవ సమాజసేవలో మెగా ఫ్యాన్స్ తాలూకా అధ్యక్షుడు రాహుల్ సాగర్

జనసేవ సమాజసేవలో మెగా ఫ్యాన్స్ తాలూకా అధ్యక్షుడు రాహుల్ సాగర్

               సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా స్థానిక గురు రాఘవేంద్ర అనాధ ఆశ్రమం నందు నిత్యావసర సరుకులు బియ్యం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది.  ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, భరత్ సాగర్ లో మాట్లాడుతూ సాయి ధరంతేజ్ గారి పుట్టినరోజు వేడుకలు పిల్లల మధ్య జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తమకు తోచిన విధంగా ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలన్న ఏకైక ఉద్దేశ్యంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నామని  అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతామని అదేవిధంగా సాయి ధరంతేజ్ గారు చేపట్టబోయే తదుపరి చిత్రాలు అన్ని సూపర్ హిట్ కావాలని దేవుని ఒక చల్లని చూపు సుప్రీం హీరో సాయి ధరంతేజ్ పై ఉండాలని కోరారు.  ఈ కార్యక్రమంలో హలో నరసింహ, విక్రమ్, శివ తదితరులు పాల్గొన్నారు.

See also  అక్రమ అరెస్టులతో ప్రశ్నించేతత్వాన్ని ఆపలేరు ? జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి