పూతలపట్టు : చింతమాకులపల్లి జనసేన పార్టీలోకి చేరికలు

పూతలపట్టు

          చిత్తూరు ( జనస్వరం ) :  పూతలపట్టు నియోజకవర్గం నాయకులు పార్టీ బలోపేతం కోసం గ్రామ గ్రామాన పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజలకు తెలియడం కోసం ” జనసేన గ్రామ బాట ” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తవణంపల్లి మండలం, కారకాం పల్లె పంచాయతీ, చింతమాకుల పల్లికు చెందిన యనమల ఉదయ్ కుమార్ తన గ్రామంలోని 50 కుటుంబాలను చైతన్యపరిచి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ మరియు మండల అధ్యక్షులు రాజశేఖర్ (శివ) ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. శ్రీ పవన్ కల్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆయన చేసే పోరాటాలకు గ్రామస్తులు అండగా ఉంటారని, ఈ కార్యక్రమం ద్వారా తమ ఊరికి నాయకులను పంపిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.

See also  జనసేనపార్టీ ఆవిర్భావ సభకి దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం