
పుట్టపర్తి, నవంబర్ 5, (జనస్వరం): ఓడి చెరువు మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో పుట్టపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడుతూ శివప్రసాద్ అధికారులు ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా భావించి అన్ని శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తరపున రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








