ప్రజా సంక్షేమమే జనసేన లక్ష్యం : కందుల నాగరాజు

కందుల నాగరాజు

   విశాఖపట్నం ( జనస్వరం ) : ప్రజా క్షేమమే జనసేన లక్ష్యమని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పోరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం గురువారం నాటికి 75 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 33 వ వార్డు అమ్మవారి వీధిలో పుష్పవతి అయిన అమ్మాయి షర్మిలకు పట్టుబట్టలు, వెండి పట్టీలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా అక్కడివారికి తన సహాయాన్ని అందించేందుకు తను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తెలియజేశారు. ప్రజల కోసమే తాను పని చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఎటువంటి ఒత్తిళ్లకు గురికాకుండా తాను చేయాలనుకున్న మంచి పనులను నిర్వహిస్తునే ఉన్నట్లు పేర్కొన్నారు. తన పట్ల నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ప్రజలలో చైతన్య వస్తుందని, ఎవరు తమకు మేలు చేస్తారనే విషయాన్ని గ్రహిస్తున్నారని అన్నారు. ప్రజలలో మార్పు వస్తే అది అధికార మార్పునకు శ్రీకారం చుడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తిరుపతి నాయుడు , ప్రశాంతి, హేమ, దుర్గ , కుమారి , జనసేన యువ నాయకులు కందుల కేదార్నాథ్ , కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

See also  GHMC ఎన్నికల జనసేన పార్టీ అభ్యర్థులకు అండగా ఉండేందుకు రూ.1,00,000 ఆర్థిక సహాయం అందించిన NRI జనసైనికుడు శ్రీను

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి