ప్రజాసేవే రాజకీయ అంతిమ లక్ష్యం : పెందుర్తి జనసేన నాయకులు వబ్బిన శ్రీకాంత్

                           విశాఖపట్నం జిల్లా నరవ గ్రామంలో ఓమ్మి అప్పారావు అనే వ్యక్తి ఈ 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ గురై తన కుడి కాలు తీవ్రమైన గాయాలు తగిలి ఇంటికి పరిమితమై ప్రభుత్వం నుంచి రావలసిన దివ్యాంగుల పెన్షన్ సదరం సర్టిఫికెట్ లేకపోవడంవల్ల పెన్షన్ రావడం లేదు, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం లోనూ ఇప్పటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం లోనూ సదరం సర్టిఫికెట్ మంజూరు చేయడంలో జాప్యం జరిపి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు, నెల రోజుల క్రితం అప్పారావు గారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సమస్యను జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ వబ్బిన జనార్థన శ్రీకాంత్ వారి దృష్టికి జనసైనికులు తీసుకొనిరాగా వెంటనే చెల్లించి అనకాపల్లి ప్రభుత్వ డాక్టర్ తో మాట్లాడి సదరం సర్టిఫికెట్ వచ్చేలాగా కృషి చేయడం జరిగింది, ఆ యొక్క సదరం సర్టిఫికెట్ ని అప్పారావుగారి ఇస్తూ ఎలక్షన్స్ అయిపోగానే మీకు దివ్యాంగుల పెన్షన్ కూడా అప్లై చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని, 4 సంవత్సరాల నుంచి కోర్టులో ఉన్న మీ కేసును కూడా యాక్టివేట్ చేసి మీకు రావాల్సిన వాటిని రావడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఈ యొక్క సర్టిఫికేట్ రావడానికి కృషిచేసిన జనసైనికుడు బొబ్బరి శీను గారికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో బొడ్డు నాయుడు, ఓమ్ని అప్పలరాజు, అశోక్ జనసైనికులు పాల్గొన్నారు.

See also  అమరుడైన జనసైనికుడి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు వాసగిరి మణికంఠ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి