రైతు ఉత్పత్తిదారుల సంస్థలపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు జరిగిన శిక్షణా కార్యక్రమం

వ్యవసాయంలో రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యలు కీలకపాత్ర పోషించాలి – జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి.

కోటప్పకొండ,జూన్ 27.

పల్నాడు జిల్లా కోటప్ప కొండ లోని కృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 28 మండలాల రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి మాట్లాడుతూ ప్రతి రైతు సంఘంలో ఉన్న సభ్యులందరూ వ్యవసాయం పై మెళుకువలు నేర్చుకొని అత్యధిక వ్యవసాయం,అధిక లాభాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ఉద్దేశ్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు.జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా మరియు పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు సహకారంతో ప్రతి మండలంలో కోటి రూపాయలు నుండి ఐదు కోట్ల రూపాయల విలువ గల ప్రాసెసింగ్ యూనిట్ లను ఏర్పాటు చేసి రైతులకు మెరుగైన మద్దతు ధరలు అందించాలని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.దీనిద్వారా రైతులు మండలాల్లో పండించిన పంటను ప్రాసెసింగ్ చేసి వాటి ద్వారా మార్కెటింగ్ చేయటం వలన రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యలకు,సభ్యులకు అధిక ఆదాయాన్ని పొందుటకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కలుగుడి అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడుతూ రైతులు పది నుండి ఇరవై మంది కలిసి ఒక గ్రూప్ గా ఏర్పాటు చేయుట ను రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటారు.మండలం లోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలను కలిపి మండల స్థాయిలో రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ను ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ సమాఖ్య లో పదిహేను మంది బోర్డు అఫ్ డైరెక్టర్లు ఉంటారని,వారిలో ఐదుగురిని పదాధికారులుగా ఎన్నుకోవటం జరుగుతుందని తెలిపారు.రైతుల కోసం ,రైతు సమస్యలను పరిష్కారం చేసుకోవటానికి ఈ సమాఖ్య లను ఏర్పాటు చేసుకోవటం జరిగిందని తెలిపారు.ఒక రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య లో పదిహేను వందల నుండి రెండు వేల మంది రైతులు వరకు ఉంటారని తెలిపారు. ఈ సమాఖ్యల ద్వారా రైతులు నాణ్యమైన పండించిన పంటలకు ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. స్టేట్ ఆఫీస్ నుండి డి పి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ జీవనోపాదుల కార్యక్రమం ద్వారా నారీశక్తి కి పెద్దపీట వేయటం జరిగిందని తెలిపారు.సమాఖ్య లోని రైతులు ఏ నెలలో ఏ కార్యక్రమాలు చేయాలనేది ఒక వార్షిక ప్రణాళిక తయారు చేసుకొని వాటి ప్రకారం రైతులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మనం తయారు చేసుకునే వస్తువులకు ఖర్చులు తగ్గించుకోవాలని, వ్యవసాయానికి పెట్టే పెట్టుబడులు ఎలా తగ్గించాలి అనే విషయాన్ని రైతులు సమావేశం ఏర్పాటు చేసుకొని మాట్లాడుకోవాలన్నారు.రైతులు బిజినెస్ ప్లాన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తిదారుల గ్రూప్ లో ప్రతి సభ్యురాలు పొదుపులు నిర్వహించేలా ఉండాలి. సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టార్ రామిరెడ్డి మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ల్లో చేసిన లావాదేవీలను ప్రతి సంవత్సరం ఆడిట్ నిర్వహించి వాటికి సంబంధించిన లాభనష్టాలను జిల్లా రిజిస్టార్ కి తెలియపరచాలని తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రవి కుమార్ మాట్లాడుతూ మా బ్యాంక్ ద్వారా అబ్బూరు లో పుట్ట గొడుగుల పెంపకం సెంటర్ ను ఏర్పాటు చేసి రైతులకు శిక్షణ ఇవ్వటం జరిగిందని,అలాగే చెంగిస్కాన్ పేట లో మునగ ఆకులను ప్రాసెసింగ్ చేసి మునగ ఆకు పొడిని తయారు చేయుటకు మేము రుణాలు అందజేస్తామని తెలిపారు.మా బ్యాంక్ ద్వారా రైతులకు అగ్రికల్చర్ రుణాలు అందజేస్తామని తెలిపారు.ఉదయ్ ఆక్వా ప్రతినిధులు మాట్లాడుతూ చేపలు పెంపకం గురించి రైతులకు వివరించారు. జిల్లాలో ప్రతి మండలంలో ప్రాసెసింగ్ యూనిట్ లు ఏర్పాటు చేయుటకు కలెక్టర్ కృతికాశుక్లా గారు ఒక ఎకరం చొప్పున ప్రభుత్వ స్థలాన్ని అందజేశారని,ఎంపి కృష్ణదేవరాయలు, జిల్లాలోని అందరూ శాసనసభ్యులు సహకారంతో ఈ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి రైతులకు వివరించారు.

See also  సమాజసేవలోనే ఆత్మసంతృప్తి అంటున్న అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ దంపతులు బచ్చు సత్యనారాయణ ,రమాదేవి దంపతులు

ఈ సమావేశంలో డి పి ఎం డేవిడ్ ,కలుగుడి సిబ్బంది,ఉదయ్ ఆక్వా సిబ్బంది,సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టార్ రామిరెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రవి కుమార్,ప్రకృతి వ్యవసాయ శాఖ డిపిఎం అమలకుమారి, 28మండలాల ఏపిఎం లు,సి సి లు, రైతు ఉత్పత్తిదారుల సభ్యులు,మహిళలు, అకౌంటెంట్ లు, పాల్గొన్నారు.