ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి : కదిరి జనసేన నాయకులు

   కదిరి, (జనస్వరం) : కదిరి నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్ ఆదేశాల ప్రకారం కదిరి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కదిరి ప్రభుత్వ హాస్పిటల్స్ సూపర్డెంట్ Dr. హుస్సేన్ ని కలిసి పేద మధ్యతరగతి తరగతి ప్రజలు వైద్యుల కొరత వల్ల చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని సకాలంలో మీరు స్పందించి సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ కదిరి జనసేన పార్టీ తరపున వినతి పత్రం అందించడం జరిగింది. కదిరి హాస్పిటల్ సూపర్డెంట్ Dr. హుస్సేన్ స్పందిస్తూ ప్రభుత్వ హాస్పిటల్ నందు మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యుల కొరతను కూడా రెండు లేదా మూడు నెలలో పరిష్కరిస్తామని అత్యవసర సేవల్లో మరింత పెంచుతామని, మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను సాధ్యం అయినంత వరకు మేము పరిష్కరించలేని పక్షంలో పై అధికారులకు కూడా విషయం తెలిపి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, ఐటీ వింగ్ కోఆర్డినేటర్ పొరకల రాజేంద్ర, కదిరి నియోజకవర్గం జనసైనికులు అనిల్ కుమార్, నాగరాజు, గణేష్, చక్రధర్ బాబు, కృష్ణకాంత్, వినయ్ కుమార్, కార్తిక్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 

See also  అత్యవసర సమయంలో మానవత్వంతో రక్తదానం చేసిన జనసైనికులు