నెల్లిమర్లలో ‘జనసేన ఉద్యమి’ సభ్యత్వానికి సన్నాహాలు వేగం

నెల్లిమర్ల, ఫిబ్రవరి 24, (జనస్వరం) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన “జనసేన ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానున్న నేపథ్యంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆదేశాల మేరకు భోగాపురం జనసేన కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి సభ్యత్వ నమోదు విధానం, అర్హతలు, ప్రాముఖ్యతపై వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, సమర్థ నాయకత్వ వికాసం, సేవా దృక్పథంతో ప్రజా కార్యక్రమాల అమలుకు ఈ సభ్యత్వ నమోదు కీలకమని పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా సాగుతుందని, ప్రతి గ్రామంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పడాల శ్రీనివాస్, జగదీష్ పల్లంట్ల, పైలా శంకర్, దాడ్సెట్టి శ్రీనివాస్, జలపరి శివ, రమేష్, కోట్ల రఘు తదితరులు పాల్గొన్నారు.

See also  గజపతినగరంలో జనసేన ఆధ్వర్యంలో మన ఊరు.. మన ఆట - సంక్రాంతి సంబరాలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి