పవన్ కళ్యాణ్ గారి జన్మదినానికి ప్రత్యేక గీతాన్నిరూపొందిస్తూ పోస్టర్ విడుదల

పవన్ కళ్యాణ్ గారి జన్మదినానికి ప్రత్యేక గీతాన్నిరూపొందిస్తూ పోస్టర్ విడుదల   

            జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నందిగామ నియోజకవర్గ జనసేన నాయకులు తోట సాయి గారు పవన్ కళ్యాణ్ గారి పై ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన మొదటి అప్డేట్ పోస్టర్ ని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ గారు నేడు వారి కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోతిన మహేష్ గారు మాట్లాడుతూ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్న వేళ ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం అవటం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. అదే విధంగా తోట సాయి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిపై ఒక ప్రత్యేక గీతాన్ని ఆయనకి, అభిమానులకి, జనసైనికులకి అందివటం అనేది నా చిరకాల కోరిక అని, అందులో భాగంగానే ఈ గీయాన్ని రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ గేయం యొక్క ముఖ్య ఉదేశం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన నాయకత్వం, ప్రజల పట్ల ఆయనకి ఉన్న అభిమానం అన్ని కలవరించుకుని ఉంటాయని ఆయన తెలిపారు. మా యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి మొదట పోస్టర్ ని విడుదల చేసిన శ్రీ పోతిన మహేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాటకి ప్రముఖ సినీ గాయకుడు శ్రీ రఘు కుంచె గారు స్వరాన్ని అందిస్తున్నారని ఆయన తెలిపారు. సేనాని మీడియా వర్క్స్ తరుపున లేబాక  శ్యాం గారి పర్యవేక్షణలో, కుమ్మరి రాజేష్, ఈమని కిషోర్ కుమార్ పి ఆర్ ఓ లుగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట ఓంకార్, తోట వేణు తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన NRI సేవా సమితి కువైట్ ‌సేవలు అభినందనీయం : ముకరం చాంద్ గారు, తాత౦శెట్టి నాగేంద్ర గారు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి