ప్రజారంజక పాలన జనసేనానితోనే సాధ్యం : విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి ముక్కా శ్రీనివాస్

ప్రజారంజక పాలన జనసేనానితోనే సాధ్యం : విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి ముక్కా శ్రీనివాస్

                                  ప్రజారంజక పాలన జన హృదయనేత, జనసేనాని పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అని జనసేనపార్టీ నాయకులు విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసిన ముక్కా శ్రీనివాస్ ఉధ్ఘాటించారు. కార్తీకమాసం చివరి వారం రోజులలో దైవదర్శనం కోసం ఆయన పలు ఆలయాలను సందర్శించడం జరిగింది. ఈసందర్భంగా తిరుపతిలో బసచేసిన ముక్కాశ్రీనివాస్ ను గురువారం జనసేన పార్టీ చిత్తూరుజిల్లా నాయకులు పుంగనూరు నానబాల లోకేశ్వర (లోకేష్ రాయ్) మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ స్థితిగతులను గురించి, జనసైనికుల, నాయకుల పనితీరు గురించి ఆయన లోకేష్ రాయ్ ని అడిగి తెలుసుకున్నారు. ఇకపై భవిష్యత్తు జనసేనపార్టీదే నని ముక్కా శ్రీనివాస్ చెప్పారు. ప్రతిఒక్క జన సైనికులు, వీరమహిళలు కుల, మత, జాతి, ప్రాంత, వర్గ, వర్ణ విభేదాలు లేకుండా ఒక్కతాటిపైకి వచ్చి సమిష్టిగా జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను తెలియజేయాలని తెలిపారు. ఈ జనసేన వసుధైక కుటుంబంలో చిన్నా, పెద్ద అందరూ కలసి మెలసి ఉంటూ, ప్రజాసేవే పరమావధిగా పరస్పర అవగాహనతో అధినేత పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడవాలని సూచించారు. సమసమాజ స్థాపనే ధ్యేయంగా జనసేనాని ఎల్లప్పుడూ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. ఎల్లప్పుడూ ప్రజాక్షేమాన్ని కాంక్షించే కారణజన్ముడు, త్యాగధనుడు అయిన పవన్ కళ్యాణ్ కు మనం అందరం మనవంతు బాధ్యతతో, అకుంఠిత దీక్షా దక్షతతో అండగా ఎల్లప్పుడూ ఉంటామని ఆయన పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలందరి ఓట్లతో పీఠమెక్కి ఏర్పడిన గత, నేటి ప్రభుత్వాలు ప్రజాక్షేమాన్ని పట్టించు కోకుండా ప్రజావ్యతిరేక విధానాలను అవలంభించడం అత్యంత హేయమైన చర్యలుగా ఆయన అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా జన సైనికులంతా ఒకేతాటిపై నిలచి, ప్రజాసమస్యలపై జనసేనశ్రేణులు అంతా ముక్తకంఠంతో పోరాటం సాగించాలని చెప్పారు. గళంవిప్పి, అట్టడుగు వర్గాల వాళ్ళందరికీ నిరంతరం అండగా ఉంటూ పోరాడాలని తెలిపారు. ప్రజాభిమానం మెండుగా ఉన్న సమ్మోహనశక్తి పవన్ కళ్యాణ్ సొంతమన్నారు. నేటిపరిస్థితులు చూస్తుంటే అరాచకపాలనకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైందని ముక్కా శ్రీనివాస్ తెలిపారు.

ముక్కా శ్రీనివాస్ కు ఘనసన్మానం
                     వైజాగ్ కు చెందిన ప్రజానాయకుడు జనసేన పార్టీ విజయనగరం ఎంపీ అభ్యర్థి ముక్కా శ్రీనివాస్ ను జనసేనపార్టీ చిత్తూరు జిల్లా నాయకులు లోకేష్ సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి కండువా & శాలువాకప్పి సత్కరించారు. అనంతరం స్వామివారి చిత్రపటంతో “చిరు” జ్ఞాపికను ఆయనకు లోకేష్ రాయ్ అందజేశారు. దీంతో ముక్కా శ్రీనివాస్ లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

See also  అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తీరును ఎండ గట్టిన మాకినీడి శేషుకుమారి