
సచివాలయంలో పేదలకు న్యాయం కన్నా రాజకీయాలే ఎక్కువ : మాకినీడి శేషు కుమారి
కాకినాడ 38వ వార్డు సచివాలయంలో రోజుకో రాజకీయం జరుగుతోందని స్థానిక ప్రజలు అంటున్నారు. జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ కొన్ని సచివాలయాల్లో పేదలకు అన్యాయం తప్ప న్యాయం జరిగే రోజు కానరావడం లేదు. కాకినాడ అ పట్టణంలోని ముఖ్యంగా శ్రీమతి మాకినీడి శేషు కుమారి గారు కౌన్సిలర్ గా ఉన్న 38వ వార్డు లో పేదల పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు చివరికి రోడ్డెక్కి మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇళ్ల పట్టాల విషయంలో సమన్యాయం చేయకుండా వారికి కావలసిన వారికి పేరు నమోదు చేసుకుని వైయస్సార్ పార్టీ కి సంబంధించిన వారు కాదు అని ముద్రవేసి పేరు నమోదు చేసుకోకుండా బయటకు నెట్టడం జరుగుతుంది అని తమ ఆవేదన వ్యక్తంచేశారు స్థానిక ప్రజలు. ఈ వాలంటరీ వ్యవస్థ రాకముందు శ్రీమతి మాకినీడి శేషు కుమారి గారు మాకు ప్రతి విషయంలోనూ న్యాయం చేశారని ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చి
వాళ్ల మనుషులు మాత్రమే న్యాయం చేసుకుని మిగతా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని మాకు ఈ వాలంటరీ వ్యవస్థ కంటే శ్రీమతి శేషు కుమారి గారికి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ జరిగితే ప్రతి పేదవారికి న్యాయం జరుగుతుందని 38వ వార్డు ప్రజలుగా మేమందరం కోరుకుంటున్నాం అన్నారు. శ్రీమతి మాకినీడి శేషు కుమారి గారు మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థ అనేది రాజకీయ నాయకుల అండదండలతో జరిగేది కాదని, ప్రతి వారిని కూడా నిష్పక్షపాతంగా తమ ఉద్యోగ వృత్తిని కాపాడుకుంటూ ముందుకెళ్లాలని అలా అయితేనే ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని, ఒక వార్డ్ కౌన్సిలర్ గా నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. కానీ ఈవిధమైన వాలంటరీ వ్యవస్థ కోసం నా వార్డు ప్రజలందరూ రోడ్డు పైకి వచ్చి ఇలా మీడియా ముందు బాధపడటం చూసి నేనెంతో చలించిపోయాను. దయచేసి ఇక నుంచి అయినా ప్రతి వాలంటీర్ ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం ప్రతి పేదవాడికి అందేలా కృషి చేయాలని, లేనియెడల ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజల తరఫున నేను పోరాడుతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అని శ్రీమతి మాకినీడి శేషు కుమారి గారు తెలియజేశారు.









