జగన్ పర్యటన సందర్భంగా ముందస్తుగా జనసేన నాయకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు

జగన్

          ఆముదాలవలస ( జనస్వరం ) : శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ రావును వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు ఉదయం 5:00 గంటలకి అరెస్ట్ చేశారు. ఈ విషయంపై పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎక్కడ జగన్ రెడ్డి చేసే అక్రమాలు, ప్రజలను నమ్మించి మోసం చేసిన హామీలు గురించి నిలదీస్తానని భయపడ్డారని అన్నారు. ముఖ్యంగా ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ గురించి నిలదీస్తాననే  భయంతోనే ఈ రోజు నన్ను అరెస్ట్ చేయించారు. ఇది సరైన పద్ధతి కాదని త్వరలోనే ప్రజలు దీనికి సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

See also  వైసీపీ పంచలకు ఊడిగం చేసేది ఎవరో అందరికి తెలుసు : తాతంశెట్టి నాగేంద్ర