
కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా ఆర్డీఓ ఆఫీసు ఎదుట గన్నవరం జనసైనికుల ధర్నా, పోలీసుల అరెస్ట్
గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కలసి సంయుక్తంగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆర్డీఓ ఆఫీసు ఎదుట రోజు నిరసన తెలపడం జరిగింది. నిరసన తెలుపుతున్న గుడివాడ పోలీస్ వారు అడ్డుకుని అరెస్టు చేసి పెదపారుపూడి స్టేషన్ కి తరలించారు. ఈ విధంగా ప్రజా ఉద్యమాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్న చర్యలను ఖండిస్తున్నామని నాయకులు అన్నారు. ఈ ప్రభుత్వం హిందూ మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను, అలాగే ప్రధాని మంత్రి మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ల మీద వ్యాఖ్యలు చేయడం సరి కాదని అన్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే మంత్రి కొడాలి నాని గారిని భర్తరఫ్ చేయాలని అన్నారు. మీరు ఇలాగే హిందూ మతం మీద అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే మీకు పోయే కాలం దగ్గర పడింది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులు దామర్ల కోటేశ్వరావు, లంకే సురేష్, చిమట రవి వర్మ, గుంటుపల్లి హర్ష, MD సంధాని, తదితరులు పాల్గొన్నారు.









