గులాబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ఆముదాలవలస ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్

గులాబ్ తుఫాను

         శ్రీకాకుళం ( జనస్వరం ) : గులాబ్ తుపాను ప్రభావంతో ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలోని తండ్యాం, లైదాం, గార పేట, మల్కాo, రాపాక, కంచరాం, కొల్లి పేట, బాణాo, లోలుగు సహా దాదాపు 12 పంచాయతీలలో నష్టపోయిన మొక్కజొన్న పంటలను నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు స్థానిక రైతులతో పాటు పరిశీలించి, వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన పంట నష్టానికి సంబంధించి రైతులను ఆదుకునేందుకు నష్ట పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో స్థానిక రైతులు మరియు జన సైనికులు పాల్గొన్నారు.

See also  బడివానిపేటలో పార్టీ బలోపేతం కోసం జనసేన జెండా ఆవిష్కరణ