అనారోగ్యముతో బాధపడుతున్న మహిళను పరామర్శించిన పిఠాపురం జనసేనపార్టీ ఇంఛార్జ్ మాకినీడి శేషుకుమారి

పిఠాపురం

    పిఠాపురం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో కొంత కాలంగా దూలపల్లి రాజులమ్మ అనే మహిళ అనారోగ్యంతో కాలు వాపు ఎక్కువ అయ్యీ బాధపడుతున్న ఆమెను చూసి, మన జనసైనికులు పిఠాపురం నియెజవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి వారి భర్త డాక్టర్ మాకినీడి వీర ప్రసాద్ గారికి తెలియజేశారు. వారు వెంటనే స్పందించి ఫోన్లో మాట్లాడి రాజులమ్మ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని ఆమెకు మెరుగైన వైద్యం కొరకు డాక్టర్లతో సంప్రదించి, మీకు నయం చేసే ప్రయత్నాలు చేస్తాము అని చెప్పటం జరిగింది. ఈ కుటుంబానికి అన్ని విధాలుగా ఆడపడుచుల ముందు ఉంటానని చెప్పారు. మా జనసైనికులు కష్టం ఉన్నచోట ఎప్పుడూ ముందుండి సొంత కుటుంబంలా తోడుగా ఉంటారని, ప్రత్యేకంగా మన జనసైనికులు అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను అని శేషుకుమారి తెలియజేశారు. అలాగే వారికి కూరగాయలు, రైస్ బ్యాగ్ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం మండల అధ్యక్షురాలు తోలేటి శిరీష, చిత్రాడ ఎంపీటీసీ -1 దూలపల్లి రత్నం, చిత్రాడ 6వార్డు మెంబర్ విజయ రామలక్ష్మి, పిఠాపురం రూరల్ కార్యవర్గ సభ్యులు కోటిపల్లి గోపి, నిమ్మన దుర్గ బాబు, బాబిశెట్టి శివ నందీశ్వర రావు, పిఠాపురం రూరల్ ప్రచార కార్యదర్శి పెంకే జగదీష్ , నంద్యాల జాన్ బాబు నాయుడు, మణికంఠ, యాగ సతీష్, అల్లు చందు, సిగాటపు వీరన్న, నాగం వెంకన్న, మేడతూ దేవబాబు, కోటిపల్లి రాజు, నాగం మధు, నురుకుర్తి సత్తిబాబు, దూలపల్లి అప్పారావు, గడ్డంలోవ బాబు, దూలపల్లి చిన్నఅప్పారావు, దూలపల్లి రాఘవ, నురుకూర్తి అబద్ధం, దూలపల్లి నాగరత్నం, గెడ్డం మని, శిలి బాబ్జి, జనసైనికులు తదితరులు రాజులమ్మ కుటుంబాన్ని పరామర్శించడానికి విచ్చేసారు. జనసైనికులు అందరు వారితో మాట్లాడి, మీకు పూర్తిగా నయం అయ్యే వరకు తమ వంతు ఇదే స్ఫూర్తితో అండగా ఉంటామని జనసైనికులు అందరూ కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో ముందుకు సాగుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారితో మమేకమై ఉంటారని తెలియజేశారు.

See also  అరెస్ట్ చేయడం దారుణం : జనసేన నాయకులు కొండేపూడి శంకర్రావు