
రాజంపేట ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి పైన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లము అని చెప్పుకునే కొంత మంది వైసీపీ గుండాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థని తప్పుగా మాట్లాడాడని కొంతమంది వాలంటీర్ లమని చెప్పుకుంటున్న వైసీపీ గుండాలు పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను దహనం చేయడం, ప్రశ్నించే గొంతుకను ప్రజా స్వామ్యాన్ని దహనం చేయడమేనని జనసేన నాయకులు అన్నారు. ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను కొంత మంది వైసీపీ గుండాలు దహనం చేసిన కార్యక్రమానికి నిరసనగా అన్నమయ్య జిల్లాలో రాయచోటి అసంబ్లీ ఇంచార్జ్ హసన్ భాష గారు, జనసేనపార్టీ సీనియర్ నాయకుడు రామ శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు హసన్ భాష గారు, రామ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ అనేది పదోవతరగతి చదువుకున్న నిరుద్యోగికి ఉద్యోగమే. పెద్దచదువులు చదువుకున్న వారికి కూడా ఉద్యగమనే గొప్ప ఆశ చూపి నిరుద్యోగంలో ముంచుతూ ఒక పార్టీకి భవిష్యత్తులో మీరే నాయకులు అంటూ నిరుద్యోగతను పెంచుతూ సామాన్యులను తమ కోసం వాడుకుంటూ ప్రభుత్వ వ్యవస్థలని నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. జానీకాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ వైసీపీ పాలన సామాన్య ప్రజలను భయాందోళన గురిచేస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలకు కూడా వైసిపీ వారి నుండి రక్షణ కావాలని కోరుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య బద్దంగా కాపాడాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వశివుల్లా, దినేష్, శివ, రెడ్డిశేకర్, సురేష్, శివయ్య, కృష్ణ, ప్రశాంత్, మహేష్, అంజి, చంటి తదితరులు పాల్గొన్నారు.









