కలువాయి గ్రామ సమస్యలను తీర్చాలని అధికారులకు వినతిపత్రం అందించిన జనసైనికులు

కలువాయి

          నెల్లూరు ( జనస్వరం ) : కలువాయి గ్రామంలో సైడ్ కాలువలు పూడికలు తీయకపోవడం వలన మురుగు నీరు నిలిచిపోయి దోమలు, మరియు దుర్గంధం ఎక్కువ వస్తోందని గ్రామ జనసైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త ఎక్కువ నిలువ చేయడం ద్వారా దుర్వాసన భరించలేక స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. చిన్నపిల్లలు విష జ్వరాల పాలవుతున్నారు. కావున  తక్షణమే కాలువ పూడికలు తీయించమని జనసేన పార్టీ తరఫున అధికారులని వినతి పత్రం అందించి సమస్యలను తీర్చమని కోరారు. పలుచోట్ల వీధిలైట్లు వెలగట్లేదని తెలియజేశారు. ఈ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలువాయి మండల అధ్యక్షుడు పెరంకొండ మనోహర్ ఉపాధ్యక్షులు ఏటూరి హరి, గణేష్ టి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులు, షేక్ మహమ్మద్ భాష, రవిచంద్ర, శ్రీను, గోవర్ధన్, కార్యదర్శిలు, కదిరి హరి, వంశి, కృష్ణ, షేక్ కాజా మురళి,విష్ణు సంయుక్త కార్యదర్శిలు సురేష్ , ప్రసాద్, హరి, నారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

See also  శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో KNOW MY CONSTITUENCY

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి