త్రాగునీటి కోసం తీవ్ర కష్టాలు పడుతున్న సాయినగర్ కాలనీ ప్రజలు : జనసేనపార్టీ రాష్ట్ర మహిళా సాధికారత చైర్మన్ రేఖగౌడ్

• నీళ్ల బిందె నిండాలంటే నీరసించి పోవాల్సి వస్తుంది

• ఉపాధి లేక వలసలు వెళుతుంటే యంత్రాలతో ఉపాధి పనులు

• పత్తికొండ నియోజకవర్గ సమస్యలపై జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కమిటీ సభ్యురాలు జావాజి రేఖ

     మద్దికెర, (జనస్వరం)  : త్రాగునీటి కోసం సాయి నగర్ కాలనీ ప్రజల అవస్థలు పడుతున్నారని జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కమిటీ సభ్యురాలు, రాష్ట్ర మహిళా సాధికారత చైర్మన్ జావాజి రేఖ అన్నారు. స్థానిక మద్దికెరలో జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గ నాయకులు రాజశేఖర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కమిటీ సభ్యురాలు జవాజి రేఖ మాట్లాడుతూ మద్దికెరలో సాయి నగర్ కాలనీ నందు నీళ్ల బిందె నిండాలంటే నీరసించి పోవాల్సి వస్తుందన్నారు. సుమారు ఐదు వందల కుటుంబాలు నివసించే కాలనీ నీటి సమస్యపై స్థానిక అధికారాలు, ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. మహిళలు నీళ్లు తెచ్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మహిళా ఎమ్మెల్యే ఉండి కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఉపాధి లేక పత్తికొండ నియోజకవర్గ ప్రజలు సుగ్గికి గుంటూరు, బళ్ళారి, బెంగుళూర్, హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళుతుంటే తుగ్గలి మండలం పెండేకల్లులోని బుగ్గానికుంటలో కూలీలతో చేయించాల్సిన నీటి కొలను పనులను యంత్రాలతో చేపట్టడం మంచి పద్దతి కాదన్నారు. రాజకీయ అండతోనే ఉపాధి పనులు యంత్రాలతో చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, అందుకు పత్తికొండ నియోజక వర్గం జనసేన కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి వాసగిరి మణికంఠ, జనసేన పార్టీ జిల్లా నాయకులు హర్షద్, పవన్ కుమార్, రేణు వర్మ, తదితరులు పాల్గొన్నారు.

See also  జనసైనికుడికి ఇంటి నిర్మాణానికి భరోసా ఇచ్చిన డా. విష్వక్ షేన్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి