గాయపడిన జనసైనికుడికి అండగా నిలిచిన పెండ్యాల శ్రీలత, పెండ్యాల హరి

జనసైనికుడి

              అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం నగరంలోని 2వ డివిజన్ కు చెందిన క్రియాశీలక జనసేన కార్యకర్తలు వంశీ, శంకర్ లు ఈనెల 12వ తేదీన జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత, పెండ్యాల హరి జనసైనికుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ఆర్థిక సహాయం, కావలసిన మెడిసిన్ అందించారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి రైతు భరోసా యాత్ర విజయవంతం అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరమని అయినా జన సైనికులకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మేము ఎప్పుడు అండగా ఉంటామని గాయపడిన జనసైనికులు క్రియాశీలక సభ్యత్వం చేయించుకున్నందు వల్ల వారికి వైద్య బీమా కింద ఆర్థిక సహాయం అందేలా చూస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, వీర మహిళలు కాశెట్టి సావిత్రి గారు, కుల్లాయమ్మ, శింగనమల నియోజకవర్గ నాయకులు ధంపెట్ల శివ గారు, తోటప్రకష్ గారు, రామయ్య, జన సైనికులు చిన్నమారన్న, సురేష్, వెంకీ, మోక్షిత్, సునీల్, మనోజ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

See also  జనసేన నాయకుల అక్రమ అరెస్టులు - అప్రజాస్వామికం : చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఏపీ శివయ్య

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి