యలమవారిదిన్నెలో కోలాహలంగా ప్రారంభమైన పవనన్న ప్రజాబాట

     నెల్లూరు సిటీ, (జనస్వరం) :  నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్విరామంగా 3, 4, 5, 39, 40, 51 డివిజన్లను పూర్తి చేసుకుని 96వ రోజున 13వ డివిజన్ యలమవారిదిన్నెలో కార్యకర్తల కోలాహలం నడుమ ఘనంగా ప్రారంభమైంది. 13వ డివిజన్ జనసేనపార్టీ కార్పొరేటర్ అభ్యర్థి డివిజన్ నాయకులు పేనేటి శ్రీకాంత్ తప్పెట్లు, బాణాసంచాతో కేతంరెడ్డి వినోద్ రెడ్డికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్గించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతం యలమవారిదిన్నె అని అన్నారు. నగరానికి అతి చేరువలో ఉన్నా కూడా ఈ ప్రాంత అభివృద్ధిని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. నేడు ప్రారంభమైన 13వ డివిజన్ పవనన్న ప్రజాబాట సుమారు 2 వారాల నుండి 20 రోజుల వరకు ఇదే డివిజన్లో కొనసాగుతుందని, డివిజన్లో ఏ ఒక్క ఇంటిని కూడా విస్మరించకుండా ప్రతి ఇంటిని సందర్శించి ప్రజా సమస్యల అధ్యయనం చేసి, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రజలందరికీ వివరిస్తామని కేతంరెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  మహిళలకు రక్షణ కల్పించాలని కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేసిన గుంతకల్ జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి