78వ రోజుకు చేరిన పవనన్న ప్రజాబాట

ప్రజాబాట

      విశాఖపట్నం ( జనస్వరం ) : పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పర్యటించారు. ఆయన ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నాటితో 78వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో 78 రోజులపాటు నిర్విరామంగా పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచి పనులను అందరికీ వివరించడం జరిగిందన్నారు. రాష్ట్ర రాజకీయాలలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన నాయకులు కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అంతా కలిసి సమన్వయంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో విశాఖలో కూడా జనసేన పార్టీ జండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు.

See also  డ్రైనేజి వ్యవస్థను శుభ్రపరచాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోని వైన౦ : సోమశిల జనసైనికులు