
సూళ్లూరుపేట ( జనస్వరం ) : దొరవారిసత్రం మండలం కలగుంట గ్రామంలో మంగళవారం 38వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని జనసేనపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు పార్టీ సిద్దాంతాలు.. ఆశయాలను వివరించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పవనన్నను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో చేపడుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి విశేష స్పందన ప్రజల నుంచి లభిస్తున్నట్లు జనసేనపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తెలియజేశారు. ప్రతి గడప వద్ద ప్రజలు తమ సమస్యలు తెలియజేస్తున్నారన్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో కుంటి సాకులు చెప్పి పథకాలను తొలిగిస్తున్నారన్నారు.








