పవన్ కళ్యాణ్ పై నోరు జారితే ఉపేక్షించం : రైల్వేకోడూరు జనసేన నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు

     రైల్వేకోడూరు, (జనస్వరం) :  రైల్వేకోడూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆడిటర్ గంధం శెట్టి దినకర్ బాబు ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు దినకర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి పరిశ్రమలు తీసుకురాలేని ప్రస్తుత ప్రభుత్వం, సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించటం మంచిది కాదని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు అని తెలిపారు. ఈపాటి విమర్శకి ప్రభుత్వ పెద్దలు అందరూ పనిగట్టుకుని స్పందించడం విడ్డూరంగా ఉంది అని, ఆ విమర్శలను ఖండించారు. రాష్ట్రంలో అనేక సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వం సినీ పరిశ్రమ ఆదాయం పైన దృష్టి పెట్టడమే దీనికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. 151 శాసనసభ్యులు ఉన్న వైసిపి ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేస్తూ సంక్షేమ కార్యక్రమాల పేరుతో వృధా చేయడం సమంజసం కాదని ఆయన తెలిపారు. రాజకీయాలలో నిజాయితీ, నిబద్ధత లేని వారి విమర్శలను జనసేన పార్టీ పట్టించుకోదు అన్నారు. పవన్ కళ్యాణ్ గారి పై వస్తున్న విమర్శలను ధైర్యంగా తిప్పికొట్టే సామర్థ్యం జనసేన కుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితురులు పాల్గొన్నారు.

See also  నెల్లూరు రూరల్ 24 డివిజన్లో జనసేన పార్టీలో చేరికలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి