భ్రష్టుపట్టిన వ్యవస్థను కూకటివేళ్ళతో సహా పెకిలించే శక్తి పవన్ కళ్యాణ్

– పవనన్న ప్రజాబాటలో జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

    నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 114వ రోజున 13వ డివిజన్ బాలాజీనగర్, గ్యాస్ గోడౌన్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ భ్రష్టుపట్టిన వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలించే శక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. రాష్ట్రంలో జనసేనపార్టీ చిన్న అలజడిలా మొదలై, విప్లవంగా మారుతూ, మొదట సాటివారిని తరువాత సమూహాలను ఆపై సమాజాన్ని ప్రభావితం చేసే బడబాగ్నిలా మారుతోందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ లోతైన ఆలోచన శబ్దబేరీలకు చెదరదని, గందరగోళాలకు బెదరదని, తర్కానికి అందదని, కంటికి కనిపించదని అన్నారు. 2024లో అడ్డుగా ఎన్ని అడ్డంకులు ఉన్నా వాటిని భళ్ళున పగులగొట్టుకుని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  లక్కవరపుకోట జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు