ప్రజల ఆశీస్సులతో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్

    ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్విరామంగా నాలుగవ రోజున 1వ వార్డ్ ముస్తాపురంలో జరిగినది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అధ్యయనం చేసిన నలిశెట్టి శ్రీధర్ ఆ సమస్యల పట్ల తమ వంతు పోరాటం చేస్తామని ముస్తాపురం ప్రజలకు భరోసా కల్పించారు. ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ డ్రైనేజీ మరియు మంచి నీళ్ళు మొదలగు ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకోవడం జరిగింది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మంచి మనసున్న పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రజల సమస్యలన్నీ తీర్చగల శక్తి ఒక పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉన్నదని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన నాయకులు దాడి భాను కిరణ్, సురేంద్ర, వంశీ, చంద్ర, ప్రసాద్, శేఖర్,అనిల్, రాకేష్, మస్తాన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

See also  రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి