పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేదే ప్రజల ఆకాంక్ష : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

పవన్ కళ్యాణ్

              నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 194వ రోజున 43వ డివిజన్ కుమ్మరి వీధి ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ రెడ్డి గారి నిరంకుశ విధానాలతో విసిగి వేసారిపోయిన ప్రజలంతా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారని, పవనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే జీవన ప్రమాణాలు మెరుగవుతాయనే నమ్మకంతో ఉన్నారని, ఆ విషయం ఈ ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతుంటే స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. రానున్న ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు జరిగినా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడడం ఖాయమని అన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో గెలిచి నెల్లూరు నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  శింగనమల నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి పలువురు ముస్లిం మైనారిటీలు చేరిక

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి