మెగా జాబ్ మేళా పోస్టర్స్ ను ఆవిష్కరించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా

చిలకలూరిపేట లో   మెగా జాబ్ మేళా.45 కంపెనీల్లో ఉద్యోగావకాశాలు

నరసరావుపేట,జూన్10 ( జనస్వరం)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 16-06-2026 (మంగళ వారం) ఉదయం 9 గంటల నుండి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి గార్డెన్స్ మునిసిపల్ ఆఫీస్ రోడ్, అర్బన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను పల్నాడు జిల్లా కలెక్టర్. కృతిక శుక్లా ఆవిష్కరించి, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ మేళాలో జోయలుకాస్, హెటిరో డ్రగ్స్, డి.మార్ట్, బిగ్ సి, రిలయన్స్ జియో, టాటా కాపిటల్, ఇసుజు మోటార్స్ వంటి సుమారు 45 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. 18 నుండి 45 సంవత్సరాల వయస్సు కలిగి SSC, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్, ఫార్మసీ, PG చదివిన అర్హులైన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.ఎంపికైన వారికి విద్యార్హతలను బట్టి రూ. 15,000 నుండి రూ. 50,000 వరకు జీతం ఉంటుంది.ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డ్ మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ఇంటర్వ్యూలకు రావచ్చు. అభ్యర్థులు ముందుగా *https://naipunyam.ap.gov.in/* వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి; ఒకవేళ చేసుకోకపోతే జాబ్ మేళా ప్రాంగణంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 7842747682, 7779858789, 7702921219, 9848793357 నంబర్లను సంప్రదించవచ్చని జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారులు తెలిపారు.

See also  రానున్న రోజుల్లో పల్నాడు నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు : గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు