మాడుగుల జనసేన నాయకుల ఆధ్వర్యంలో పల్లె-పల్లెకి జనసేన

    మాడుగుల, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గములో జనసేన పార్టీలోకి జోరందుకున్న వలసలు. చిడికాడ మండలంలో తంగుడుపల్లి గ్రామంలో అనేక మంది వైసీపీ మరియు టీడీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు.  పల్లె- పల్లెకి జనసేన  కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ నాయకులు గుమ్మడి శ్రీరామ్ ఇంటి ఇంటికి తిరిగి జనసేన పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను, జనసేన పార్టీ హామీలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. మాడుగులలో 2024 ఎన్నికలలో జనసేన జెండా ఎగురుతుంది అని ప్రజలు, జనసైనికులు ఆశాభావం వ్యక్తo చేశారు.

See also  ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటూ అధికారపార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారా...?

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి