టీం పిడికిలి పోస్టర్లను ఆవిష్కరించిన పాలకొండ జనసేన నాయకులు

     పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గ కేంద్రములో టీమ్ పిడికిలి ప్రోజెక్టు రెండులో భాగంగా సీబీఐ దత్తపుత్రుడుకి జనసేన సవాల్ , జనసేన లక్ష్యం అన్నం పెట్టే రైతన్న రాజు కావాలి అంటూ నినాదాలు ఇస్తూ ఆటోలకు, గోడలకు పోస్టర్ లను అతికించారు. పాలకొండ పట్టణంలో జనసైనికులు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్ర గురించి ఆటోలో ఉన్న ప్రయాణికులకు అవగాహన కలిగించారు. అనంతరం నియోజకవర్గ నాయకులు పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్, గొర్ల మన్మధ, కడగల హరికృష్ణ మాట్లాడుతూ రానున్న రోజుల్లో పాలకొండ నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో జనసేన పార్టీ మరింత బలాన్ని చేకూర్చాలని జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు టీమ్ పిడికిలి ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కళ్యాణ్, గణేష్, లోకేష్, సాయి, పవన్, శ్రీకాంత్, రాంబాబు, దుర్గ, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

See also  కరెంట్ షాకులొద్దు జగన్ రెడ్డి సారూ ! కృష్ణా జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్