ఆచంట నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి చిత్ర పటానికి పాలభిషేకం

ఆచంట

         ఆచంట ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చిత్ర పటానికి పాలభిషేకం చేశారు.  ఈ కార్యక్రమంలో ఉమ్మడి పగో జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మంగళగిరి ఇప్పటం గ్రామంలో కేవలం రాజకీయ కక్షతో జనసేనపార్టీ సభకు స్థలాలు ఇచ్చారనే అక్కసుతో రైతులు ఇల్లు ఆకారణంగా కూల్చివేస్తే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో పర్యటించి వారి పరిస్థితులు చూసి చలించి ఎవ్వరైతే ఇల్లును కోల్పోయారో వారికి ప్రతిఒక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకురావడం శుభపరిణామం అన్నారు. అందుకు సంఘీభావంగా ఈ రోజు ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి జనసేనికులు పాలాభిషేకం చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయుకులు తోట తాతజీ, కడిమి శ్రీనివాస్, యేడిద తేజా విగ్నేష్, పంపన శ్రీనివాస్, బెల్లంకొండ ప్రసాద్, కటుంగ హేమంత్, అడబాల అజయ్ మొదలగువారు పాల్గొన్నారు.

See also  రోడ్లు వేయండి - ప్రజల ప్రాణాలు కాపాడండి : పాలకొండ జనసేన నాయకులు