ఔట్ స్టాండింగ్ ఆసియా CEO అవార్డ్ అందుకున్న డాక్టర్ జె వి ఎస్ భాస్కర్

“ఔట్‌స్టాండింగ్ ఆసియా CEO అవార్డు” అందుకున్న డాక్టర్ జె వి ఎస్ భాస్కర్.

కొచ్చి.డిసెంబర్08(జనస్వరం)

ఆసియా ఖండ స్థాయిలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అవార్డుల కార్యక్రమంలో డాక్టర్ జె వి ఎస్ భాస్కర్ కి “ఔట్‌ స్టాండింగ్ ఆసియా CEO అవార్డు” లభించడం గర్వకారణంగా మారింది.30కి పైగా దేశాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, నాయకులు, సామాజిక సేవా ప్రతినిధులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో డా. జేవీఎస్ భాస్కర్ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందజేశారు.డా. జేవీఎస్ భాస్కర్ ఇన్స్పైర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక CEO గా, యువత శక్తివంతీకరణ, నాయకత్వ అభివృద్ధి, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, మోటివేషనల్ స్పీకింగ్ రంగాల్లో విశేషమైన సేవలు అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.ఈ సందర్భంగా డా. జేవీఎస్ భాస్కర్ మాట్లాడుతూ “ఈ అవార్డు నా ఒక్కడిదే కాదు.నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరి విజయానికి ఇది ప్రతీక. చిన్న గ్రామం నుంచి ఆసియా స్థాయిలో గుర్తింపు రావడం నిజంగా గర్వంగా ఉంది. ఇంకా పెద్ద స్థాయిలో సమాజానికి సేవ చేయాలనే బాధ్యతను ఈ అవార్డు మరింత పెంచింది” అని అన్నారు.ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రేరణాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తూ, యువతలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో డాక్టర్ జేవీఎస్ భాస్కర్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

విద్య, ఉపాధి, వ్యక్తిత్వ వికాసం రంగాల్లో ఆయన చేస్తున్న కృషికి ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.
ఈ “ఔట్‌స్టాండింగ్ ఆసియా CEO అవార్డు” డా. జేవీఎస్ భాస్కర్ సేవలకు మరో మైలురాయిగా నిలిచి, భారతదేశానికి ఆసియా స్థాయిలో గౌరవాన్ని తీసుకొచ్చింది.

See also  పాలన చేస్తోంది ప్రభుత్వమా ? పవన్ కళ్యాణా ??