
తెలంగాణలో జనసేన సర్పంచ్ పై కక్ష్య సాధింపు చర్యలు
తెలంగాణాలో జనసేన పార్టీ తరుపున గతంలో స్థానిక ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామ సర్పంచ్ గా తాళ్ళపండు గౌడ్ గారు ఎన్నికయ్యారు. గెలిచిన ఏకైక సర్పంచ్ పై రాజకీయ ఒత్తిళ్ళు కలిగించి రాజకీయ కుట్రలు చేస్తున్నారు. రైతు వేదిక నిర్మాణం లో అలసత్వం ప్రదర్శిస్తున్నాడనే నెపంతో పదవి నుంచి తర్నికల్ గ్రామ సర్పంచ్ సస్పెండ్ చేయడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయునుంన్నదని తెలిసి, జనసేన సర్పంచ్ అయినందునే కావాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం సస్పెండ్ చేసిందని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. అనేక పర్యాయాలు పాండు గౌడ్ ని టిఆర్ఎస్ లో చేరాలని ఒత్తిళ్ళు తెచ్చినా, తాను నమ్ముకున్న పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లోనే, జనసేన పార్టీ సిద్ధాంతాలతో నడుస్తానని తెగేసి చెప్పటం తో స్థానిక టిఆర్ఎస్ నాయకులు పాండు గౌడ్ పై కుట్ర పన్ని రైతు వేదిక ని సాకుగా చూపించి, సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయటం జరిగింది. పండు గౌడ్ నాయకత్వం పై ఈర్ష్య తో ఈ కుట్ర పన్నారని లేకుంటే పక్కనే ఉన్న మండలంలో టిఆర్ఎస్ సర్పంచ్ రైతు వేదికకి ఇప్పటి కి స్థలం కేటాయించలేదు. మరి ఆ సర్పంచ్ ని సస్పెండ్ చేయకుండా ప్రభుత్వ అధికారి MPDO నిరంకుశ పాలనకు నిదర్శనం అని ప్రజలు అంటున్నారు. తెలంగాణ జనసేన పార్టీ ఈ సంఘటన పై న్యాయ సహాయం చేయవలసిందిగా తర్నికల్ జనసైనికులు కోరుతున్నారు.








