ఓ సారూ మా గ్రామ రోడ్డును పట్టించుకోండి : సికబడి గ్రామ జనసైనికులు

ఓ సారూ మా గ్రామ రోడ్డును పట్టించుకోండి : సికబడి గ్రామ జనసైనికులు

                 చాలా  సంవత్సరాలుగా  విజయనగరం  జిల్లా సికబడి గ్రామం నుండి జియ్యమ్మవలస మండలం రోడ్లు బాగా అధ్వాన్నంగా ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే సికబడి నుండి మరువాడ రోడ్లు గుంత గుంతలుగా ఉండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. దీనిపై కురుపం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లు మరమ్మత్తులు చేస్తారని సికబడి మరియు జియ్యమ్మవలస మండల జనసైనికులు కోరుచున్నారు. ఈ రోడ్లుని ఇలా ఉంచడం వలన ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళు గాని, 2 వీలర్, వెహికల్స్ మీద వెళ్లే వారు గాని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల వలన సస్పెన్షన్స్ పాడైపోవడం, అదే రకంగా మైలేజ్ లు రాకపోవడం, గోతులలో పడ్డారు అంటే క్రింద పడిపోయి దెబ్బలు తగలడం ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ రోజున ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పుడు ఉన్న నాయకులను ఒకటే అడుగుతున్నాం వాళ్ళు దీనిమీద నిబద్ధత తో చేస్తారా?? లేదా జనసైనికులు అందరూ కలిసి దీని మీద చర్యలు తీసుకుని ధర్నా చేయవలసిన పరిస్థితి ఉందని జనసైనికులు హెచ్చరించారు. 

See also  జనసేనపార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి