ఉత్తర అమెరికా సెయింట్ లూయిస్ మరియు కాన్సాస్ సిటీలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఉత్తర అమెరికా

          న్యూస్ ( జనస్వరం ) : సెయింట్ లూయిస్ మరియు కాన్సాస్ సిటీలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ జనసైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది. చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ సందీప్ పంచకర్ల ఖమ్మం జిల్లా సంపత్ నాయక్ జనసైనికులని ఉద్దేశించి జూమ్ కాల్ సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ జనసేనని ఎలా బలోపేతం చేయాలి, NRI జనసైనికులు ఏ విధంగా భారత్ లో ఉన్న తమ కుటుంబ సభ్యులని, బంధువులకి జనసేన సిద్దాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చెప్పి వారిని వోట్ గా ఎలా మలచాలి అని చెప్పడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి సుమారు 100 మందికి పైగా జనసైనికులు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేనపార్టీకి సుమారు 27 లక్షలు రూపాయలు విరాళాలు ప్రకటించడం జరిగింది. ఈ విరాళాలని వారు జనసేన అధికార వెబ్సైట్ ద్వారా తమ తమ విరాళాలు పంపించినట్టు తెలిపారు. అక్కడకి వచ్చిన జనసైనికులు అందరు తమ ఆనంద హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు. ఆత్మీయ సభను విజయంగా అభివర్ణించారు. ఉత్తర అమెరికాలో ఇదే మొట్ట మొదట జనసేన ఆత్మీయ సమావేశం ఇదే అనడం అతిశయోక్తి కాదని అన్నారు. ఈ విజయం అందరి సమిష్టి కృషికి తార్కామని, ఎక్కువ మొత్తంలో జనసైనికులు కలవడం కానీ, ఒకే సారి పార్టీకి ఇంత మొత్తంలో విరాళం అందిస్తారని ఊహించలేదన్నారు. జనసేన ఆత్మీయ సమావేశ విజయంలో ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు సత్య గాజుల, వెంకట్ అరసాల, విజయ్ సాక్షి, అశోక్ సింగిరికొండ, యల్లమంద అల, శ్రీనివాస్ లొట్టల, శ్రీనివాస్ జమ్ములమడక, నంద పుప్పాల, వెంకట్ బండి, సాయి కృష్ణ తేజ, రామానాయుడు ఎనుముల, పవన్ దాసం, రత్నేశ్వర్ మర్రే, రమణ బెవర, రవి జక్కంపూడి మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు. 

See also  ఒంగోలులో మాస్కులు పంపిణీ చేసిన జనసేన నాయకులు